
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ చందు స్నేహిత-2 ప్రోగ్రాంను హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల్యము, కౌమార దశలో పిల్లలు ఎదుర్కొన్నటువంటి గుడ్ టచ్ బ్యాచ్ వంటి అంశాలపై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కౌమార దశలో ఎదురయ్యే సమస్యలపై కనీస అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు స్నేహిత కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. యువతులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పసిగట్టాలని ఎవరైనా కానీ బ్యాట్ టచ్ చేసినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు గాని, అధికారులకు గాని తెలియజేయాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు పాల్గొని వారి వీధులను వివరించి వారిని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాల స్థాయిలో స్నేహిత టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుగుణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, పక్కన జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ చందు



హాజరైన విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు..
చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ చందుతో కలిసి హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.
హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టరులను ఇతర రికార్డులను వెరిఫై చేశారు. ఎన్ సిడి క్లినిక్ లో రిజిస్టర్ లను అందులో నమోదైన అధిక రక్తపోటు మరియు షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును పరిశీలించి వారికి మందులు ఇస్తున్న తీరును పరిశీలించారు. అవుట్ పేషెంట్లతో మాట్లాడుతూ వారు అధిక రక్తపోటు మరియు షుగర్ వ్యాధికి సంబంధించి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులను వాడుకోవాలని మరియు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకుని అందరూ ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను వాడుకోవాలని మందుల ఖర్చులు తగ్గించుకోవాలన్నారు. ఫార్మసీ స్టోర్స్ లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను పరిశీలించారు. పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్ఆర్ ను దాని రోజువారి టెంపరేచర్ రికార్డులను పరిశీలించారు. ఐఇసి బోర్డును పరిశీలిస్తూ దానిపై ప్రదర్శించిన అధిక రక్తపోటు షుగర్ వ్యాధి మందులకు సంబంధించిన వివరాల స్పెసిమెన్ లను పరిశీలించారు. ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో మహిళల రీస్క్రీనింగ్ 100% పూర్తి చేయాలన్నారు. రెఫెరల్ కేసులను ఫాలోఅప్ చేస్తూ వారికి అవగాహన కలిగించాలన్నారు. ప్రసూతి గది పరిశుభ్రతలను పరిశీలించి అందులో ఉండాల్సిన అత్యవసర మందుల పరిశీలించి సిజేరియన్ కానుపు చేయించుకోవడం వల్ల కలిగే సమస్యలను వివరించి సాధారణ డెలివరీల కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగేటట్లుగా గర్భవతులను మరియు వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలన్నారు. పీహెచ్సీ నార్మల్ డెలివరీ లను ఇంప్రూవ్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ చందు, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్ మరియు సంబంధిత వైద్య సిబ్బంది ఉన్నారు.

జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ చందు, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్





