
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి సంవత్సరం మాదిరిగానే రంగాపూర్ కల్వరి టెంపుల్ లో చర్చి ఫాదర్ రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో ఘనంగా కోతకాల పండుగ మరియు మినీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా దైవ సందేశం అందించడానికి రెవరెండ్ కె. సీమోను బాబు, కరీంనగర్ నుండి డాక్టర్ జైదా ప్రకాష్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పుష్పలత, అలాగే కేక్ కటింగ్ చేయడానికి ముఖ్య అతిథులుగా సింగపూర్ వాస్తవ్యులు సంఘ సేవకులు జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిపాటి జయపాల్ రెడ్డి హాజరైనారు. దైవ సందేశకులు సీమోను బాబు కన్నీటి పాటలతో చక్కని బైబిల్ ప్రవచనాలు అందించారు. డాక్టర్ జె. ప్రకాష్, పుష్పలత మాట్లాడుతూ మేము ఏ స్థితిలో ఉన్నను క్రీస్తును అవలంబిస్తూ నడుస్తున్నామని అతి చిన్న స్థాయి నుంచి దేవుడు మమ్మల్ని గొప్ప స్థితిలోకి నడిపించాడని క్రీస్తును కొనియాడారు. సామాజిక కార్యకర్త జయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన ఫాదర్ నెల్సన్ గారిని అభినందించారు. వీరు మాట్లాడుతూ క్రీస్తును ఆదర్శంగా తీసుకొని మదర్ తెరిసా జీవితాన్ని సేవకే అంకితం చేసి కోట్లాది హృదయాలలో స్థానం సంపాదించుకొని ప్రపంచ మాతృమూర్తిగా చరిత్ర పుటల్లోకి వెళ్లిందని ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకొని మా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియపరిచారు. ఫాదర్ నెల్సన్ మాట్లాడుతూ జయన్న ఫౌండేషన్ ద్వారా కంటి ఆపరేషలు, త్రాగునీరు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతి సంవత్సరము 10వ తరగతి విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. కాబట్టి జైపాల్ రెడ్డి గారిని అభినందించి వారికి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కేకును జయపాల్ రెడ్డి అతిథులు కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచారు. కోతకాల పండుగ కాబట్టి పిల్లలు, యువతులు నాట్యాలతో ప్రజలను అలరించారు. ఈ కార్యక్రమమును సభాధ్యక్షులుగా సంఘ సభ్యులు అయినటువంటి బ్రదర్ నాగార్జున చక్కగా నడిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంఘ సభ్యులతో పాటు హాజరైన ప్రతి ఒక్కరికి చక్కని విందును ఏర్పాటు చేశారు. ఘనంగా జరిగిన ఈ వేడుకలకు వేముల రవికుమార్, తూముల రాజేశ్వరి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వినయ్, రక్షిత, స్వామి దాసు, ప్రమోదిత, పాస్టర్ సువార్త రాజు తదితరులు పాల్గొన్నారు.



సంఘ సేవకులు జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిపాటి జయపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతున్న దృశ్యం.












మినీ క్రిస్మాస్ వేడుకల దృశ్యాలు…





