
– చెక్ డ్యామ్ ను పెల్చివేసిన ఇసుక మాఫియా
పాల్గొన్న మాజీ మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలము తనుగుల గ్రామ శివారులోని మానేరు నదిపైన ఇటీవల కూలిపోయిన చెక్ డ్యాంను మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లు మాజీ ఎమ్మెల్సీలు.. పలువురు ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 24 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామ్ ను ఇసుక మాఫియా చెందిన కొందరూ చెక్ డ్యామ్ ను ఉద్దేశ్యపూర్వకంగా కూల్చివేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్ ల కూల్చి వేతలు పరిపాటిగా మారిందాన్నారు. గతంలో హుస్సేన్మియా వాగుపై, అదే విధంగా నిర్మల్ జిల్లా స్వర్ణ వాగుపై పెల్చివేశారు. ప్రస్తుతం మానేరునది పై చెక్ డ్యామ్ పెల్చివేశారన్నారు. ఆనాడురైతు సంక్షేమం కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో 24 కోట్లతో ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ ను రాత్రికి రాత్రే ఇసుక మాఫియా ముసుగులో పెల్చివేశారాన్నారు. రాష్టంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక చెక్ డ్యామ్ కూడా కట్టలేదన్నారు. బి ఆర్ ఎస్ పాలనలో 12వేల, చెక్ డ్యామ్ లు, 44వేల చెరువులు, కుంటలకు మరమ్మతు పనులు చేశామన్నారు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో పేద రైతుల ఇండ్ల ను కూల్చి వేస్తున్నారని ఆరోపణలు చేశారు. మానేరు పై చెక్ డ్యామ్ కూల్చి మూడు రోజులైనా ఇప్పటి వరకూ కూల్చిన వారిని పట్టుకోలేదన్నారు. చెక్ డ్యామ్ ను కట్టిన రాఘవ కన్ స్ట్రెక్షన్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లో డ్రామా కంపనిగా మారిందాన్నారు. రెండేళ్ల పాలనలో 12 లక్షల ఎకరాలు కాదు, ఒక్కలక్ష ఎకరాలకు కూడా సాగు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆనాడు కాంగ్రెస్ నే కుట్రలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ను పేల్చి వేయవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. గతంలో హుస్సేన్ మియా పై చేక్ డ్యామ్ లు పేల్చి నప్పుడు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.



తనుగుల గ్రామ శివారులోని మానేరు నదిపైన ఇటీవల కూలిపోయిన చెక్ డ్యాంను పరిశీలిస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు.. పలువురు ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు





