
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తన విధుల పట్ల నిర్లక్ష్యం వహించి ఒక గర్భిణీ స్త్రీ మృతికి కారణమైన హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ నందితా రెడ్డిని విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని నెలల క్రితం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి సైదాపూర్ మండలం గొడిశాలకు చెందిన గర్భిణీ స్త్రీ ప్రసవము కోసం రాగా అప్పుడు విధులు నిర్వహిస్తున్న నందితారెడ్డి నిర్లక్ష్యం వహించడంతో ఆమె మూడు రోజుల తర్వాత మృతి చెందింది. బంధువులు ఈ విషయంపై కలెక్టర్ ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ జరిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎం అండ్ హెచ్ ఓ ఆమెను విధులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

డాక్టర్ ను విధుల నుoడి తొలగించిన కలెక్టర్..





