
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన మోడల్ చెరువును సుందరీ కరణ చేస్తున్న హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య ను మంగళవారం స్థానిక మామిండ్లవాడకు చెందిన ప్రజలు పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మామిళ్లవాడ చివరన ఉన్న మోడల్ చెరువు కట్టపై దట్టంగా చెట్లు పెరగడంతో వాటి నుండి పాములు ఇండ్లలోకి వచ్చేవని అన్నారు. గుబురుగా చెట్లు ఉండడంతో చాలా అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని అన్నారు. మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని మోడల్ చెరువును సుందరీ కరణ చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎండి ఖాళీదు హుస్సేన్, కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తదితరులున్నారు.

శాలువా కప్పి మున్సిపల్ కమిషనర్ సత్కరిస్తున్న మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎండి ఖాళీదు హుస్సేన్, కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తదితరులు..





