Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
సమాజంలో సగానికి పైగా ఉన్న మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని హుజురాబాద్ ఆర్డిఓ ఎస్ రమేష్ బాబు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా సంఘాల సభ్యురాళ్లకు చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు చీరలను అందిస్తుందని, అలాగే వారి అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలను అందిస్తుందని అన్నారు. వడ్డీ లేని రుణాలు తీసుకున్న మహిళలు వారి కుటుంబాన్ని కోసం వాటిని ఖర్చు చేయాలని అన్నారు. కుటుంబాల అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గoలోని ఐదు మండలాల్లో 3,952 లబ్ధిదారులకు 3 కోట్ల 83 లక్షల వడ్డీలేని రుణాల చెక్కును స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ తాసిల్దార్ జక్కని నరేందర్, ఎంపీడీవో తూర్పాటి సునీత, డిఆర్డిఏ ఏపీఎం జ్యోతి, పద్మావతి, కరుణాకర్, శ్రీనివాస్, మండల సమాఖ్య కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.

వడ్డీ లేని రుణాల చెక్కును అందజేస్తున్న ఆర్డీవో రమేష్ బాబు..






