Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించి అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించిన మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించిన రోజు సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగం దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సీనియర్ సిటిజన్, ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ పట్టణ కోర్టు చౌరస్తా వద్ద ఉన్న భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ విగ్రహానికి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా వాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానిదని అన్నారు. మారిన పరిస్థితులకనుగుణంగా అవసరమైన రాజ్యాంగ నిబంధనల సవరణకు రాజ్యాంగం కల్పించిందన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 8 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయని రామారావు తెలిపారు. భారత రాజ్యాంగం వల్లనే సామాజిక న్యాయం న్యాయం జరుగుతుందని ఇందులొ భాగంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన ఓసి సామాజిక వర్గీయుల పేదలకు విద్యా ఉద్యోగాల్లో 10/. శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని పోలాడి రామారావు పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు విద్యా ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, కార్మికుల శ్రేయస్సుకు ప్రత్యేక హక్కులు లభించాయన్నారు అట్టడుగు పేదలకు రాజ్యాంగం ఒక రక్షణ కవచం అని, వచ్చే పార్లమెంటు, శాసన సభల్లో 33 శాతం మంది మహిళా ప్రజా ప్రతినిధులు ఉండబోతున్నారని ఇది మన రాజ్యాంగం కల్పించిన గొప్పదనమని రామారావు కొనియాడారు.
స్వేచ్ఛా,మత, విద్యా , ఆహార భద్రత, వాక్స్వాతంత్రపు హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు. దళితులను, గిరిజనులను అగౌరపర్చి, చిన్న చూపు చూడకుండా, వేధించే ద్వేషించే వారిపై చర్యలకు ఎస్సీ ఎస్టీ ఆక్ట్ ను మన రాజ్యాంగం కల్పించిందన్నారు. ప్రపంచంలో మన రాజ్యాంగానికి విశిష్ట గౌరవం దక్కిందని ఇది మన ప్రతి పౌరుడికి గర్వకారణం అని రాజ్యాంగాన్ని గౌరవించి పౌరులందరూ ఆచరించాలని పోలాడి రామారావు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కరీంనగర్ పట్టణ కోర్టు చౌరస్తా వద్ద ఉన్న భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న పోలాడి రామారావు.





