
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక ఎన్నికల్లో ఎస్టి కులాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకినీ రాజు నాయకత్వంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పూతాడి శ్రీనివాస్, జిల్లా నాయకులు కుతాడు తిరుపతి, కుమారస్వామిలు ఆరోపించారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ గ్రామంలో ఎస్టిలకు సర్పంచులుగా మరియు వార్డ్ మెంబర్లుగా అవకాశం ఇవ్వలేదు అని, 2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం జరిగిందనీ గుర్తు చేశారు. జిల్లాలోని
వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామం సర్పంచ్
కోర్కల్ గ్రామం వార్డ్ మెంబర్, మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామం సర్పంచ్, మానకొండూరు గ్రామం వార్డ్ మెంబర్,
కొత్తపల్లి మండలం చింతకుంటగ్రామం సర్పంచ్, జమ్మికుంట మండలం మాచినపల్లి గ్రామం వార్డ్ మెంబర్, ప్రభుత్వం ఇచ్చినటువంటి GO ప్రకారం రొటేషన్ పద్ధతిలో కూడా ఇవ్వలేదు అన్నారు. దయచేసి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ రిజర్వేషన్ పదిపాదికను సవరణ చెయ్యాలని కోరారు.
కరీంనగర్ జిల్లాలో ఎస్టీ కులస్తులకు రాజకీయంగా మరియు అనేక విషయాలలో అన్యాయం జరుగుతుంది అని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రిజర్వేషన్లను మార్చి ఎస్టీలకు న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్, జిల్లా నాయకులు కుతాడు తిరుపతి, కుమారస్వామి మరియు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పూతాడి శ్రీనివాస్, కుతాడు తిరుపతి, కుమారస్వామి..





