
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
రైతులు మారుతున్న కాలాన్ని అనుగుణంగా నూతన పంటల సాగు పై దృష్టి పెట్టాలని, ఆయిల్ ఫామ్ పంటలతో రైతులకు మేలు కలుగుతుందని హుజురాబాద్ హార్టికల్చర్ అధికారిని బి మంజు వాణి అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటలపై అవగాహన సదస్సు చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని, ఈ పంట రైతులకు భావితరాల పంటగా అవుతుందన్నారు. ఆయిల్ పామ్ పంట సాంప్రదాయ నూనె గింజల కంటే 4 నుంచి 5 రేట్ల అధిక దిగుబడి ఉంటుందన్నారు. ఒకే భూమిలో 4రకాల పంటలు సాగు చేసి మూడింతలు అధిక ఆదాయం పొందవచ్చని ఆమె అన్నారు. సింగిల్ విండో అధ్యక్షుడు కొండాలరెడ్డి మాట్లాడుతూ.. పంట సాగుకు అనుకూలమైన పరిస్థితులు, దిగుబడి వచ్చు విధానం, అమ్ముకునే విధానం, మార్కెటింగ్ సౌకర్యం, మొక్కకు ఇవ్వవలసిన పోషకాలు, ఎరువులు, యాజమాన్య పద్ధతులు, గెలలు కోసే విధానం అంతర పంటలతో వచ్చే ఆదాయం గురించి ఆయన రైతులకు వివరించారు. ఆయిల్ పామ్ తోట ఒకసారి వేస్తే 35 ఏండ్ల వరకు దిగుబడి ఇస్తుందని, 7 ఏండ్ల నుండి అంతర పంటగా కోకో, వక్క, జాజికాయ సాగుతో వంద ఏండ్ల వరకు ఆదాయం పొందవచ్చని అన్నారు. డ్రిప్పు పరికరాలకు 80- 100 శాతం సబ్సిడీ , పంట సాగుకు ఎకరానికి 4200 నాలుగేండ్ల వరకు ప్రభుత్వం నుండి కల్పించిన సబ్సిడీ ఉంటుందని ఆమె అన్నారు.ఈ సదస్సులో సింగిల్ విండో ఉపాధ్యక్షుడు శంకర్, డైరెక్టర్ లు జి ప్రభాకర్ రెడ్డి, సాయిలు, లక్ష్మారెడ్డి, అనసూయ, సింగిల్ విండో సీఈవో గోస్కుల వివేకానంద, రైతులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హార్టికల్చర్ అధికారి మంజువాణి

సమావేశంలో మాట్లాడుతున్న సింగిల్ విండో అధ్యక్షుడు ఏడవల్లి కొండల్ రెడ్డి..






