
.- వాకింగ్ ట్రాక్,చిల్డ్రన్ పార్క్ పనుల పరిశీలిన.
– నాణ్యతతో నిర్మించాలని సూచన
– మోడల్ చెరువు ను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి పరిశీలించిన ప్రణవ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న మోడల్ చెరువు సుందరీకరణలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్ పనుల్లో నాణ్యత పాటించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధికారులు సూచించారు. గురువారం రోజున హుజురాబాద్ పట్టణంలోని మోడల్ చెరువు ను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాల విస్తీర్ణం కలిగిన చెరువు ఇన్ని రోజులు అభివృద్ధికి నోచుకోలేదనీ, గొప్పగా పరిపాలించామని చెప్పిన నాయకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో వారికే తెలవాలి అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హుజురాబాద్ పట్టణానికి సంబంధించి అభివృద్ధి కొరకు 15 కోట్ల నిధులు మంజూరు చేశామని, దాంట్లో భాగంగా పిల్లలకు ఆడుకోవడానికి,
ఆహ్లాదానికి నిధులు కేటాయించామని, చెరువుకు రావడానికి ఇబ్బందిగా ఉన్న పిచ్చి మొక్కలు సైతం గత పాలకులు తొలగించే సమయం లేదా అని ప్రశ్నించారు? మోడల్ చెరువుతో పాటు గంగోనికుంటను కూడా అభివృద్ధి చేస్తామని, హుజురాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. గత పాలకులకు బురద చల్లే రాజకీయం తప్ప అభివృద్ధి పై ధ్యాస లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కమిషనర్ కే సమ్మయ్య, మామిళ్ల వాడకు వచ్చిన ప్రణవ్ ను కాంగ్రెస్ నాయకులు ఖలీద్ హుస్సేన్, తౌసిప్, అప్సర్ తదితరులు శాలువాతో సత్కరించారు, ఆయన వెంట పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



మోడల్ చెరువును సందర్శించి పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ప్రణవ్..

మామిళ్లవాడకు వచ్చిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు పుష్ప గుచ్చాలిచ్చి, శాలువా కప్పి సత్కరిస్తున్న మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, సీనియర్ నాయకుడు మహమ్మద్ ఖలీద్ హుస్సేన్..





