
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణ ప్రజల జీవన స్థితిగతుల పై గణాంక శాఖ ఆధ్వర్యంలో బుధవారం పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహించినట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో, గ్రామాల్లో ఉపాధి స్థితిగతులపై సర్వే చేశామని అన్నారు. కాగా తాసిల్దార్ జక్కని నరేందర్, మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యలకు గణాంక వివరాలను కరపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అశ్వినిగాంధీ, ఎంపీఎస్ఓ జ్యోతి, మున్సిపల్ మెప్మా ఆర్పి చాంద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్న గణాంక శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది..

సర్వే వివరాలను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కు అంద చేస్తున్న గణాంక శాఖ అధికారి..





