Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
ఇటీవల బదిలీపై వచ్చిన హుజురాబాద్ తహసిల్దార్ జక్కని నరేందర్ ను పద్మశాలి సంఘం, బిసి ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ మండల ప్రజలకు ఆయన మరిన్ని సేవలు అందించి మంచి పేరు సాధించాలని ఆకాంక్షించారు.
అలాగే హుజురాబాద్ మండలంలో కూడా ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించడంలో వారు కృషి చేయాలని రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు కోరారు
ఈ కార్యక్రమంలో బిసి ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, బిసి ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, బోయిని సంపత్, జూపాక శివమణి, చిలువేరు శ్రీకాంత్, తాటిపాముల దేవేందర్, కోడెం రవి, కుసుమ రమణయ్య, తలకొక్కుల శ్రీనివాస్, మాడుగుల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.





