
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన నాసాని కార్తీక్ కు అస్సాంలోని ఎన్ఐటి సిల్చార్ నుండి డాక్టరేట్ లభించింది. కార్తీక్ ఆంధ్రప్రదేశ్లోని ఆదిత్య యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఎన్ఐఐటి నుండి కాంప్రహెన్సివ్ డిజైన్ ఆఫ్ నానో స్కేల్ హెటిరో జంక్షన్ డ్యూయల్ గేట్ వర్టికల్ టిఎఫ్ ఈటి అనలైటికల్ మోడలింగ్ సెన్సింగ్ ఫంక్షణాలిటీ, సర్క్యూట్ లెవెల్ ఇంటిగ్రేషన్ అనే అంశంపై డాక్టర్ బృంద బౌమిక్ డాక్టర్ పుష్ప దేవిల నేతృత్వంలో పరిశోధన చేయగా లభించింది. కాగా హుజురాబాద్ లో విద్యాభ్యాసం చేసిన అనంతరం సింగపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారు. కాగా కార్తీక్ కు డాక్టరేట్ లభించడం పట్ల పలువురు విద్యాభిమానులు, స్నేహితులు అభినందించారు.

డాక్టరేటు పొందిన నాసాని కార్తీక్





