Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన అవసరం అని డిసిహెచ్ డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ …రాజ్యాంగం ప్రజలకు అనేక రక్షణలు కల్పిస్తుందని అన్నారు. చట్టాల పట్ల అవగాహన ఉండడం వల్ల ప్రజలు వారి హక్కులకు నష్టం వాటిల్లదన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ చందు, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి, డాక్టర్ ప్రసాద్ రావు, పలువురు వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.






