
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణంలోని కాకతీయ కాలనీలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బత్తుల విశ్వదీప్ అనే విద్యార్థి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత షాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లాలో జరిగిన జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఈ ఎంపిక జరిగినట్లు తెలిపారు. ఈనెలలో మధ్యప్రదేశ్ లో జరిగే జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల పాఠశాల డైరెక్టర్లు,ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.

జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మాంటిస్సోరి విద్యార్థి బత్తుల విశ్వదీప్





