
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పెన్షనర్స్ డే ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రిటైర్డ్ ఉద్యోగులకు క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలలో వాకింగ్ షాట్ పుట్ క్యారం మొదలైన నిమిషాలలో పోటీలు నిర్వహించారు. సంఘ సభ్యులు సుమారు వందమంది క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడల్లో విజేతలకు త్వరలోనే బహుమతులు అందజేయడం జరుగుతుందని సంఘ అధ్యక్షులు ఉస్మాని పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గంజి జవర్ధన్, కోశాధికారి దుర్గాజి, సభ్యులు జయ రామిరెడ్డి, వి లక్ష్మయ్య, మాడిశెట్టి నరసయ్య, ఫిజికల్ డైరెక్టర్లు కొన్ని రాజిరెడ్డి, వెంకటరెడ్డి, ఇలాసాగరం వీరస్వామి, లక్ష్మీనారాయణ, సదానందం, తదితరులు పాల్గొన్నారు.








