
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చేల్పూర్ మూడో వార్డులో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న పంజాల తిరుపతికి మద్దతుగా హుజురాబాద్ జీవిత బీమా లియాఫీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారము పెద్ద ఎత్తున నిర్వహించారు. మూడవ వార్డులోనీ ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. వార్డు అభివృద్ధికి చేపట్టవలసిన పనులను గుర్తించి తిరుపతి గెలిచిన తర్వాత ఏ విధంగా సమస్యలను పరిష్కరిస్తారో వివరించి చైతన్యపరిచారు. పంజాల తిరుపతిని వార్డు సభ్యునిగా గెలిపిస్తే గతంలో పరిష్కారానికి నోచుకోని మురుగు కాలువలు సిసి రోడ్లు, వీధిలైట్ల ఏర్పాటు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించేలా కృషి చేస్తారన్నారు. మూడో వార్డు ఓటర్లు తిరుపతి స్టూలు గుర్తుపై ఓటు వేసి గెలిపించినచో వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి చిన్న సమస్య వచ్చిన తను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తిరుపతి హామీ ఇవ్వడం జరిగింది. మూడో వార్డు అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఓటర్లకు హామీ ఇచ్చారు. సేవా గుణం, ప్రజాబలం ఉన్న వ్యక్తిని చూడాలని.. ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నీతి నిజాయితీగల వ్యక్తి తిరుపతికి వేయాలని ఈ సందర్భంగా వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ లియాఫి అధ్యక్షుడు ముకిరాల సంపత్ రావు, కోశాధికారి గంట సంపత్, మరియు మారెపల్లి శ్రీనివాస్, దశరథము, భాస్కర్, గ్రామ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




స్టూలు గుర్తుకు ఓటేయాలని నినదీస్తూ గ్రామంలో ర్యాలీ తీస్తున్న పంజాల తిరుపతి మద్దతుదారులు…

పంజాల తిరుపతి స్టూలు గుర్తుపై ఓటు వేయాలని ఫ్లెక్సీ పట్టుకొని మూడవ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న లీయాఫీ నాయకులు..





