
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో పంచకోటి సంతోష్ గురుస్వామి 18వ పడి సందర్భంగా ఈ రోజు రాత్రి ఘనంగా దివ్య మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. పుల్లూరి ప్రభాకర్ రావు, కన్నన్ దురైరాజు, కే వెంకట్రావు, ఉపేందర్ గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ మహా పడిపూజ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. అయ్యప్పస్వాముల శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మాతుమ్రోగింది. కన్య స్వాములు అయ్యప్ప స్వామిని పేటతుళ్ళితో స్వామి శరణం అయ్యప్ప… శరణం శరణం అయ్యప్ప అంటూ పేట తుళ్లి ఆడి పాడారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పదునేట్టంబడినీ సంతోష్ గురుస్వామి వెలిగించారు. వెంటనే స్వాముల శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మారుతుంది. రంగ రంగ వైభవంగా దివ్య మహా పడిపూజ కార్యక్రమాన్నికి అయ్యప్ప భక్తులు నాన్ అయ్యప్పలు హాజరుకాగ తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అల్పాహారం అందజేసారు.

















