
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షుడు రాముల కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం జిల్లా అధ్యక్షునికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ఐదు సంవత్సరాలుగా హుజురాబాద్ మండలంలో బిజెపి పార్టీ బలోపేతం కోసం కృషి చేయడం జరిగిందని, పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను తూచా తప్పకుండా చేయడం అన్నారు. నా వ్యక్తిగత కారణాలవల్ల ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన బాధ్యతలు నిర్వహించ లేకపోయానని అందువల్ల మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షులకు పార్టీ పెద్దలకు పంపినట్లు ఆయన తెలిపారు.

బిజెపి మండల అధ్యక్షుడు పదవికి రాజీనామా చేసిన రావుల కుమార్..





