Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ సింగిల్ విండో ప్రత్యేక అధికారిగా ఎండి జలాలుద్దీన్ అక్బర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ విండో చైర్మన్ ల పదవులను రద్దు చేసిన సందర్భంగా వీరిని నియమించింది. అక్బర్ కు హుజురాబాద్ తో పాటు జూపాక సింగిల్ విండో కు కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది. హుజురాబాద్ పట్టణానికి చెందిన జలాలుద్దీన్ అక్బర్ ఈ ప్రాంతంలోనే ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించనుండగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జలాలుద్దీన్ అక్బర్





