
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రస్తుత కాలంలో వినియోగదారులు వివిధ రకాల వ్యక్తులచే మోసాలకు గురవుతున్నారని వారికి వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండడం మంచిదని వినియోగదారుల మండలి హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు అనుమల్ల ముకుంద రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ…వస్తువులు కొన్నప్పుడు మోసపోకుండా ఉండాలంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని దాని నాణ్యత ధర తయారైంది ఎప్పుడో అనే విషయాలు పరిశీలించాలని అన్నారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలని రసీదు లేకపోతే కోర్టులో వాదనకు బలం ఉండదని ఆయన అన్నారు. మార్కెట్లో వ్యాపారస్తులు చేసే మోసాలను వినియోగదారులు ఉండడానికి కేంద్ర ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణ చట్టం తీసుకుని వచ్చిందన్నారు. ఈ చట్టం వల్ల ఏ వస్తువు కొన్న విక్రయిదారుడు కి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. కంపెనీ వల్ల వ్యాపారి వల్ల మోస పోయినప్పుడు ముందుగా సంస్థకు ఫిర్యాదు చేయాలని స్పందన లేకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలన్నారు. హుజురాబాద్ డివిజన్లో వినియోగదారులకు ఎలాంటి సహాయ సహకారాలు తాము అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

వినియోగదారుల మండలి హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు అనుమల్ల ముకుందరెడ్డి





