
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్ 27: డ్రోన్ తో వరి నాట్లపై హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట, సిర్సపల్లి గ్రామాలలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏవో భూమిరెడ్డి, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగ శాస్త్రవేత్త విజయ్ మాట్లాడుతూ.. వరి వంగడాలని నేరుగా విత్తే పద్దతికి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారని అన్నారు. మారుత్ డ్రోన్ కంపెనీ సహకారంతో రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా వరిని విత్తే పద్దతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పద్దతి ద్వారా ఖర్చులు తగ్గించవచ్చని, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అనూష, పోతిరెడ్డిపేట సర్పంచ్ సుమలతాసురేందర్, రైతులు చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

డ్రోన్ సహాయంతో పరునాటు వేసే విధానాన్ని వివరిస్తున్న శాస్త్రవేత్తలు.. వ్యవసాయ అధికారులు.






