Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలిగా వెంకట్రావుపల్లి గ్రామ సర్పంచ్ పత్తి అనితరెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలో ఇటీవల గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎన్నికైన పలువురు సర్పంచులు సమావేశమై ఆమెను సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వంతడుపుల కస్తూరి, కొడిగూటి ప్రవీణ్, ఇమ్మడి దయాకర్, కుంట అరుణ, కలువల సంపత్, వి విజయ, ఏ మాధవి, సుమలత, పెరుమాళ్ళ హైమ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీతను కలిసిన హుజురాబాద్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పత్తి అనిత, ఇతర సర్పంచులు





