
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: రోడ్డు భద్రత నియమాల పట్ల అవగాహన కలిగి ఉండడం అవసరమని హుజురాబాద్ ఏంవిఐ కంచి వేణు అన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రోడ్డు భద్రత నియమాలు ప్రజలకు తెలిసి ఉండాలని ముఖ్యంగా విద్యార్థులకు తెలియడం వల్ల భవిష్యత్తులో సమాజంలో రోడ్డు ప్రమాద రహితంగా మారుతుందని ఈ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ విద్యార్థులకు రోడ్డు భద్రత నియమ నిబంధనలు వివరించాల్సి ఉంటుందన్నారు. బాల్య దశలోనే వారికి రోడ్డు భద్రత నియమాలు తెలపడం వల్ల వారు యువకులుగా మారిన తర్వాత కచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తారని అన్నారు. వ్యాసరచన పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతుల అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరేం సంజీవరెడ్డి, హుజురాబాద్ అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు, పి సతీష్, విన్సెంట్ జార్జ్, ముచ్చ నారాయణరెడ్డి, రాజకుమార్, రవీందర్ రెడ్డి, రవీందర్, పి కిరణ్ కుమార్, డి కోటేశ్వర్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎంవిఐ కంచి వేణు..

వ్యాసరచన పోటీలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు..





