
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతి హుజురాబాద్:“ బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలి” అనే డిమాండ్‌తో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున హుజురాబాద్ మండల అధ్యక్షుడు నరేండ్ల ఇంద్రసేనారెడ్డి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు రఘుపతి తదితరులు కలిసి హుజురాబాద్ మండల ఎంఆర్.ఓ నరేందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ హుజురాబాద్ అధ్యక్షుడు నరేండ్ల ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని వెలికి తీయడమే రాజ్యాధికార పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు గట్టు బిక్షపతి, మాదం ఐలయ్య, రాగం కృష్ణమూర్తి, రాజేందర్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఆర్.ఓ నరేందర్ కు వినతి పత్రాన్ని అందజేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు

మీడియాతో మాట్లాడుతున్న హుజురాబాద్ మండల అధ్యక్షుడు నరేండ్ల ఇంద్రసేనారెడ్డి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు





