
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ బిజెపి నాయకుడు గూడూరు ప్రభాకర్ రెడ్డి సతీమణి పరమపదించారని తెలిసి మండలంలోని ఇప్పలనర్సింగాపూర్ గ్రామంలో పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ల వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు యాంసాని శశిధర్, యాళ్ల సంజీవ్ రెడ్డి, దామేర అనురాగ్, కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్, కరుణాకర్, చైతన్య రెడ్డి, ముత్యంరావు, రమణారెడ్డి, భీమోజు వెంకట్, మురాద్ హుస్సేన్, వినయ్, విజేందర్ రెడ్డి, రాజశేఖర్, తదితరులు నాయకులు పాల్గొన్నారు.

పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి..

నివాళులర్పిస్తున్న బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజు..

ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి…





