
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి13: పురపాలక సంఘ / నగరపాలక సంస్థల రెండవ సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 30 ఎన్నికల వార్డులకు సంబంధించిన 60 పోలింగ్ బూతులను గుర్తిస్తూ చిత్తు జాబితాను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెంసారపు. సమ్మయ్య, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఎన్ అశ్వినీగాంధీతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్తు జాబితాను పట్టణ ప్రజలు పరిశీలించి, అవసరమైతే తమ అభ్యంతరాలు లేదా సూచనలు సమర్పించుకోవాలని అధికారులు తెలిపారు.


పోలింగ్ బూతులను గుర్తిస్తూ చిత్తు జాబితాను మంగళవారం విడుదల చేస్తున్న కమిషనర్…





