
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట వద్ద గల వాటి మీద ఆంజనేయస్వామి జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో భోగి పండుగ సందర్భంగా బుధవారం ఎడ్లబండ్ల ఊరేగింపు ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గందె శ్రీనివాస్ మాట్లాడుతూ…ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులకు మంచి దిగుబడి రావాలని ఆ దేవుని దయతో రావాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎడ్లబండ్లతో రైతులు ఆలయం చుట్టూ ప్రదక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు నిర్వహించగా గ్రామ రైతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తిరునగరి తిరుమలయ్య, కుర్జీ ప్రదీప్, ఆలయ కమిటీ సభ్యులు అపరాజ ముత్యంరాజు, గుంటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఎడ్లబండ్ల ఊరేగింపును ప్రారంభిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ గందె శ్రీనివాస్







