
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని మామిళ్ల వాడకు చెందిన ముషం జయలక్ష్మి (60) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందింది. గత రెండు రోజుల క్రితం ఆమెకు అనారోగ్యం కలగడంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్టంట్ వేశారు. కాగా బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆమె మృతి చెందింది. జయలక్ష్మి మృతి చెందిన బాధలో కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆమె మృతి చెందిన పదిమందికి ఉపయోగపడాలనే ఆకాంక్షతో ఆమె నేత్రాలను దానం చేయడానికి అంగీకరించారు. సదాశివ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తిలకు సమాచారం ఇవ్వడంతో వరంగల్ ఎల్విపి టెక్నీషియన్ నరేందర్ సహకారంతో కార్నియాలు సేకరించి హైదరాబాదు ఐ బ్యాంకుకు తరలించారు. జయలక్ష్మి నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరి అందులకు చూపునిచ్చేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులు భర్త జగన్, కుమారుడు కృష్ణ, కోడలు ఆమని, కుమార్తెలు- అల్లుండ్లు గోలి స్వప్న సురేష్, కొక్కుల సంధ్య, శ్రీకాంత్, మరిది వెంకటేశ్వర్లను సదాశివ ఫౌండేషన్ అభినందించింది. ఆమె తనువు లేకున్నా ఆమె కళ్ళు దానం చేసి సజీవంగా నిలపడం పలువురు ఆమె కుటుంబ సభ్యులను కీర్తించారు.

ముషం జయలక్ష్మి (60) ఫైల్ ఫోటో





