Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో 15న సంక్రాంతి పర్వదినం సందర్భంగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఈవో సుధాకర్,కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, ప్రధాన పూజారి అవధానుల భాస్కర్ శర్మలు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ వాహనాల ఊరేగింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దేవాలయ ఆవరణo లో డాన్స్ మాస్టర్ శ్వేత ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాలు , సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రత్యేక దర్శనాలు చేసుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నట్లు వారు చెప్పారు. భక్తులు ఆలయాన్ని సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.






