
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
క్రీడలు శారీరక దృఢత్వానికి, ఆరోగ్యకరంగా ఉండటానికి మానసిక ఒత్తిడిని తగ్గించి మనస్సుకు ఉల్లాసం కలిగించి ఉత్సాహంగా పనిచేయడానికి పాజిటివ్ ఆలోచనలు కలగటానికి ఎంతో ఉపయోగ పడతాయని సీనియర్ సిటిజన్, ప్రముఖ రైతు ప్రజాసంఘాల నాయకుడు పోలాడి రామారావు అన్నారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని వన్నారం గ్రామ సర్పంచ్ తాళ్ళపల్లి సంపత్ ఆధ్వర్యంలో నాలుగు జట్లతో క్రీకెట్ పోటీలను గ్రామ క్రీడా మైదానం లో నిర్వహించారు. ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన గెలుపొందిన క్రీడాకారుల జట్లకు వన్నారం గ్రామ పంచాయతి ఆవరణలో గ్రామ సర్పంచ్ తాళ్ళపల్లి సంపత్, మాజీ సర్పంచ్ బాకారపు శ్రీనివాస్, ఉప సర్పంచ్ బాకారారపు రాములు, సీనియర్ నాయకుడు బాకారపు తిరుపతిలతో కలిసి బహుమతులను అందజేసి రామారావు మాట్లాడారు. మానకొండూర్ మండలంతో పాటు సమీప మండలాలైన శంకరపట్నం, తిమ్మాపూర్, వీణవంక మండలాల క్రీడాకారులతో వన్నారం గ్రామ క్రీడాకారులు పోటీపడి రాణించడం శుభ పరిణామం అని జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించడానికి వారికి నా సంపూర్ణ సహకారం అందిస్తానని అన్నీ సౌకర్యాలు స్వంతంగా సమకూర్చుతానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాకారపు రాములు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు బాకారపు శ్రీనివాస్, మద్దెల లక్ష్మయ్య మాజీ ఎంపీటీసీ గంగుల రవి, మాజీ ఉపసర్పంచులు బాకారపు తిరుపతి, బుద్దుల తిరుపతి లతో పాటు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


విజేతలకు బహుమతులు అందజేస్తున్న పోలాడి రామారావు..







