
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ కేంద్రంగా జిల్లా సాధన కోసం అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ శనివారం హుజూరాబాద్ పట్టణంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు హుజురాబాద్ జిల్లా సాధన సమితి జేఏసీ కన్వినర్ బీమోజు సదానందం తెలిపారు. శుక్రవారం రాత్రి హుజురాబాద్ పట్టణంలోని విఎల్ఆర్ గార్డెన్ లో జిల్లా సాధన కోసం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు జిల్లా సాధన కోసం జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో, మేధావులతో విద్యావంతులతో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు ఆయన తెలిపారు. శనివారం జరిగే నిరాహార దీక్షకు హుజురాబాద్, సైదాపూర్, శంకరపట్నం ,వీనవంక, ఇల్లందకుంట, జమ్మికుంట ,కమలాపూర్ ,ఎలుకతుర్తి ,భీమదేవరపల్లి ,టేకుమట్ల, వావిలాల మండలాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.


జిల్లా సాధన కోసం అఖిల పక్షం సన్నాహక సమావేశం





