
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జనవరి 17 :
హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని కేసి క్యాంప్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 44వ బ్రహ్మోత్సవములు 18వ తేదీ ఆదివారము నుండి ఈ నెల 22 తేదీ గురువారం వరకు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు కొదమగుళ్ల నందకిషోర్ ఆచార్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.18 జనవరి 2026 ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు.
19 జనవరి2026 సోమవారం రోజున అగ్ని ప్రతిష్ట, ద్వజారోహణము, దేవత ఆహ్వానము కార్యక్రమం ఉంటాయి.
*20 జనవరి 2026 మంగళవారం రోజున నిత్య హోమం, బలిహారము కళ్యాణోత్సవం(అన్న ప్రసాదం వితరణ)
*21 జనవరి 2026 బుధవారం రోజున సాయంత్రం
7 గంటలకు నిత్య హోమం, బలిహారము, సహస్ర దీపాలంకరణ.
*22 జనవరి 2026 గురువారం రోజున పూర్ణాహుతి. పుష్పయాగం, ద్వాదశరాధన, ఆశీర్వాదం కార్యక్రమంలో ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కోరారు.
భక్తులు మరింత అదనపు సమాచారము కొరకు సెల్ నెంబర్ ల ద్వారా సంప్రదించవచ్చు.
9949585149.(అర్చకులు)
కమిటీ సభ్యులు 9121994006, 9948940886,
9989766710లలో సంప్రదించాలన్నారు.


కేసి క్యాంపులోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేది ఇక్కడే!





