
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరిగే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు
హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని వరంగల్ కరీంనగర్ రాష్ట్ర రహదారిపై వాహనాల తనిఖీలను ఎంవీఐ కంచి వేణు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన వాహనాల ధ్రువపత్రాలను ఫిట్నెస్ కలిగి ఉందా లేదా అని విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని అన్నారు. వాహనదారులకు రహదారి భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వాహనాల నడిపే ప్రతి ఒక్కరూ అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండి మద్యం సేవించకుండా రహదారి భద్రతా నియమాలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. వాహన సామర్థ్యం తప్పనిసరి” అంటే వాహనానికి ఉండాల్సిన ఫిట్నెస్, పనితీరు, భద్రత, మరియు చట్టబద్ధమైన అవసరాలు తీర్చడం తప్పనిసరి అని అన్నారు. వాహన నైపుణ్యాలు(డ్రైవింగ్), రోడ్డు నిబంధనల పాటించడం, వాహన నిర్వహణ ముఖ్యమైనవనీ, పాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేషన్, ఓవర్లోడ్ చేయకపోవడం వంటివి తప్పనిసరి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, హోంగార్డ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలోని వరంగల్ – కరీంనగర్ రాష్ట్ర రహదారిపై వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్న ఎంవీఐ కంచి వేణు





