
– టిడిపి పట్టణ కమిటీ అధ్యక్షులు రామగిరి అంకుష్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి18 : తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణ కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణ కమిటీ అధ్యక్షులు రామగిరి అంకూస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ ఆవరణలో నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామగిరి అంకుష్ మాట్లాడుతూ..తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన సాగించిన పాలన చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్యకర్త ప్రజా సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బస్టాండ్లో వేచి ఉన్న ప్రయాణికులకు పండ్లను పంపిణీ చేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు ఎస్కే ఫయాజ్, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రతాప రాజు, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ శివ కోటేశ్వరరావు, ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ అబాల శంకర్, బీసీ పట్టణ ప్రెసిడెంట్ కాముని రాజేశం, పట్టణ ఉపాధ్యక్షులు ఆడేపు రవీందర్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి శడమాకి బిక్షపతి, ఎస్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ గుణశేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షులు పూదరి రమేష్, టౌన్ మాజీ ఉపాధ్యక్షులు మాడిశెట్టి అశోక్, వికలాంగుల విభాగం మాజీ అధ్యక్షుడు పంజాల శివ, నాయకులు శ్రీపాద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు..





