
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేస్తున్న ప్రతి కార్మికునికి, ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 2026కు సంబంధించిన నూతన డైరీని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ముఖ్య సలహాదారుడు వర్దినేని రవీందర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తాను కట్టుబడి ఉన్నానని, దాంతో పాటు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందరికి అందేలా తాను చూసుకుంటానని ఆ బాధ్యత నాది అని తెలిపారు. అధ్యక్షుడు మార్త రవీందర్ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా పెన్షన్లు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా ఇన్చార్జ్ ఠాకూర్ శివదయాల్ సింగ్, కార్యదర్శి పేరాల లక్ష్మణరావు, ముఖ్య సలహాదారు ఎం రాజమౌళి, ఆర్గనైజింగ్ కార్యదర్శిలు బొంగుని రాజమౌళి, పిఎస్ రెడ్డి, బత్తిని సంజీవ్, కొంపల్లి వెంకటరెడ్డి, మేకల మల్లారెడ్డి, గోలి ఉపేందర్, బి మొగిలి, జి సదానందం, వేముల దేవేందర్ రెడ్డి, కంకల కొమురయ్య, తిరుమని కనకయ్య, మండ కనకయ్య, చక్రపాణి తదితర కార్మిక విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 2026కు సంబంధించిన నూతన డైరీని ఆవిష్కరిస్తున్న ప్రణవ్, రవీందర్ రావు, రిటైర్డ్ ఉద్యోగులు

మాట్లాడుతున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్


అతిథులు ప్రణవ్ రవీందర్ రావును సత్కరిస్తున్న ఆర్టీసీ యూనియన్ నాయకులు, పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు..





