
– ఫిబ్రవరి 27న ఢిల్లీలో 10 వేల మందితో ఓసిల మహాధర్నా.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(హైదరాబాద్): జాతీయ రాష్ట్రాల స్థాయిలో చట్ట బద్ధత గల ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఐకాస రాష్ట్ర నాయకుల సన్నాహక సమావేశం లో ఆయనతో, ఓసి జేఏసీ జాతీయ ఉపాధ్యక్షులు చందుపట్ల నరసింహరెడ్డి, ప్రధానకార్యదర్శి గట్టు మహేష్ బాబు, ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి లు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ కోసం కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి ఆదాయ పరిమితిని 10లక్షల రూ.లకు పెంచాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. తమ డిమాండ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఫిబ్రవరి నెల 27న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద 10 వేల మందితో నిర్వహించే మహధర్నాకు ఓసి లందరూ రాజకీయాల కతీతంగా అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా మహాధర్నా గోడ ప్రతులను, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అక్కడికి చేరుకున్నారు బీసీ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఆర్ కృష్ణయ్యని మర్యాద పూర్వకంగా పోలాడి రామారావుతో పాటు నాయకులు కలిసి సహకారాన్ని కోరారు. అంతకు ముందు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని పోలాడి రామారావు స్వగ్రామమైన వన్నారం గ్రామానికి విచ్చేసిన మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీ వీ రామకృష్ణారావులతో వచ్చే నెల ఫిబ్రవరి 27 న ఓసిల డిమాండ్లకు నెరవేర్చాలని కోరుతూ ఓసి జేఏసీ ఆధ్వర్యంలో డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసి ల మహాధర్నా గోడ ప్రతులను పోలాడి రామారావు ఆవిష్కరింపచేశారు. కార్యక్రమంలో ఐకాస జాతీయ ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహరెడ్డి ప్రధానకార్యదర్శి గట్టు మహేష్ బాబు ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి, రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి తౌటిరెడ్డి రాజిరెడ్డి ఆల్ ఇండియా వెలమ సంఘం అధ్యక్షుడు దివాకర్ రావు, రాష్ట్ర టింబర్ డిపో అధ్యక్షుడు చకిలం రమణయ్య, వైశ్య ఫెడరేషన్ నాయకులు సింగిరికొండ నర్సింహులగుప్త, మహంకాళి రాజన్న, చకీలం రాజు, విశ్వేశ్వర్ రావు, బ్రాహ్మణ సంఘం జేఏసీ అధ్యక్షుడు దీపక్ బాబు, కమ్మ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాయపాటి వెంకటేశ్వర్ రావు తదితరులతో పాటు రాష్ట్ర ఐకాస నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు


మాట్లాడుతున్న ఓసీ జేఏసీ జాతీయ ఉపాధ్యక్షులు చందుపట్ల నరసింహరెడ్డి, ప్రధానకార్యదర్శి గట్టు మహేష్ బాబు..


మహాధర్నా గోడ ప్రతులను, కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఓసి జెఏసి జాతీయ అధ్యక్షుడు రామారావు, ఇతర నాయకులు..

బీసీ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఆర్ కృష్ణయ్యని మర్యాద పూర్వకంగా పోలాడి రామారావుతో పాటు నాయకులు

ధర్నా పోస్టర్ లను ఆవిష్కరిస్తున్న వన్నారం గ్రామానికి విచ్చేసిన మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీ వీ రామకృష్ణారావులు





