
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జనవరి18: వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబిటిసి కార్యక్రమంలో 2026కు గానూ హుజురాబాద్ వాసవి వనిత క్వీన్స్ క్లబ్ కొత్త కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. జమ్మికుంట ఎంపిఆర్ గార్డెన్స్ లో సమావేశం, ఎన్నిక జరిగాయి. క్లబ్ అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన చీకోటి త్రివేణి, కార్యదర్శిగా మేడిశెట్టి కృష్ణవేణి, కోశాధికారిగా గంగిశెట్టి కళ్యాణి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. క్లబ్ సభ్యుల మధ్య ఐక్యత, సమన్వయం అవసరమని, క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులను చైతన్యవంతం చేసే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సభ్యులు ఇందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ పుల్లూరి బాల మోహన్ ఆధ్వర్యంలో జరగ్గా ముఖ్య అతిథిగా ఆర్ సి గాయత్రీ నాగభూషణం, క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ నంగునూరు శైలజ తదితరులు పాల్గొన్నారు.

క్లబ్ అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన చీకోటి త్రివేణి, కార్యదర్శిగా మేడిశెట్టి కృష్ణవేణి, కోశాధికారిగా గంగిశెట్టి కళ్యాణి ఎన్నిక కాగా సత్కరిస్తున్న అతిథులు..

నూతనంగా క్లబ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన పట్టణానికి చెందిన చీకోటి త్రివేణి





