
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నట్లు ప్రకృతి పర్యావరణ సంస్థ సీఈవో మూగ జయశ్రీ తెలిపారు. హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని రైతు వేదిక ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం (ఎస్ ఎఫ్ ఏసీ) సహకారంతో ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో *హుజురాబాద్ మత్స్యకార ఉత్పత్తిదారుల సంఘం, సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తిదార సంఘాల సభ్యులకు సంఘం పనితీరు వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు.మత్స్య కారులు ఆర్థికాభివృద్ది సాధించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో ఏర్పాటైన మత్స్యకార ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేయాలన్నారు. వీటి ద్వారా దళారీ వ్యవస్థను నియంత్రించవచ్చన్నారు. ప్రభుత్వ రాయితీలు, వ్యవసాయ, చేపల ఉత్పత్తులకై మార్కెటింగ్ సౌకర్యం, నాణ్యమైన విత్తనాలు ఎరువుల, చేపల నిల్వలకు ప్రత్యేక శీలీకరణ కేంద్రాలు వంటి సదుపాయాలు కల్పించబడతాయని వివరించారు. సంఘాల్లో ప్రతీ మత్స్యకారుడు లాభాలు అర్జించి, ఆ కుటుంబాలు ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ మత్స్యకార సంఘాల ప్రాజెక్ట్ ఇంచార్జ్ పి.వినోద్ కుమార్ , సంఘం చైర్మన్ గొడుగు సమ్మయ్య, మత్స్యకార కమ్యూనిటీ హెడ్ సీనియర్, సీనియర్ పాత్రికేయులు ఆనుమాస రాజేందర్ ,
సంఘ డైరెక్టర్లు గొడుగు తిరుపతి, రాజు, భాస్కర్, ఈర్ల ప్రవీణ్, ఐలయ్య, రాజేందర్, రమేష్, పిట్టల రోజారాణి, తిరుపతి మరియు చెల్పూర్, కనుకులగిద్దె, పాపక్కపల్లి, ఇప్పల్ నర్సింగాపూర్, కందుగుల, బోర్నపల్లి, జూపాక, వావిలాల, రాంపూర్, పోతిరేడిపేట, జమ్మికుంట, వీణవంక గ్రామాల మత్స్య సంఘాల అధ్యక్షులు ఆల్లా రమేష్, గంట శ్రీనివాస్, పంజా రమేష్, నరసన్న, చంద్రమౌళి, గువ్వల రవి, మత్స్యాకారులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రకృతి పర్యావరణ సంస్థ సీఈవో మూగ జయశ్రీ

హుజురాబాద్ మత్స్యకార ఉత్పత్తిదారుల సంఘం, సర్వసభ్య సమావేశంకు హాజరైన వివిధ సంఘాల అధ్యక్షులు, నాయకులు..





