
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి 20 : హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 26వ వార్డు నుండి తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి పోటీ చేయనున్నారు. ఆమె గతంలోనే ముచ్చటగా మూడు సార్లు విజయం సాధించారు. వరుసగా నాలుగోసారి కూడా గెలిచి మున్సిపల్ ఎన్నికల చరిత్రలో రికార్డు సృష్టించాలని ఆమె ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా 26వ వార్డు రిజర్వేషన్ జనరల్ గా రిజర్వేషన్ కలిసి వచ్చింది. దీంతో ఆమె మరోసారి పోటీకి సన్నద్ధమవుతున్నారు. 2006 గ్రామపంచాయతీ ఎన్నికల్లో 11 వార్డులో మేజర్ గ్రామ పంచాయతీ నుండి మొదట వార్డు మెంబర్ గా లావణ్య గెలుపొందారు. తర్వాత 2014లో నగర పంచాయతీ ఎన్నికల్లో 13వ వార్డు నుండి కౌన్సిలర్ గా విజయం సాధించారు. తదనంతరం 2019లో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా హుజురాబాద్ ఏర్పాటు కాగా, 26వ వార్డు నుండి ఆ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించారు. ప్రస్తుతం అదే వార్డు నుంచి తిరిగి కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.

విజయ రహస్యమిదేనా?
తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం ద్వారా ప్రజా వ్యతిరేకతను పూర్తిగా జయించారు. నాలుగోసారి గెలిచి ఆమె మున్సిపల్ లో రికార్డు సృష్టించేందుకు ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు. వార్డులో అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు అన్ని వర్గాలతో మంచి సంబంధాలు కలిగి, వార్డుపై పూర్తి పట్టు కలిగి ఉండడం, ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నీతి నిజాయితీ తో పని చేయడం, ఒక్క ఫోన్ కాల్ తో వారి ఎదుట వాలిపోవడం, సమస్యలు పరిష్కరించడం, ఎలాంటి వివాదాలు ఉన్నా పరిష్కరించడం, వార్డు ప్రజలతో ఒక కుటుంబ సభ్యులుగా మెదలడం, పేదలకు సహాయ సహకారాలు అందించడం తదితర అంశాలు ఆమె గెలుపుకు బాటలు వేస్తున్నాయనే అభిప్రాయం ఉంది.

వార్డులో 💯 శాతం అభివృద్ధి పనులు పూర్తి
వార్డులో అభివృద్ధి పనులు దాదాపుగా అన్ని పూర్తి కాగా చిన్న చిన్న రిపేర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. డ్రైనేజీలు, సిసి రోడ్లు, వీధి దీపాలు, ప్రతినిత్యం పారిశుధ్యం పై నిర్వహణ, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ద, ఇంటింటికి నల్లా నీళ్లు, జమ్మికుంట రోడ్, వరంగల్ రోడ్, అన్ని వీధుల్లో 💯 డ్రైనేజీ పనులు, ప్రధాన రహదారుల్లో డివైడర్ల నిర్మాణం, ఇల్లందుల వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయడం, పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లో సీసీ రోడ్డు నిర్మాణం, హరితహారంలో మొక్కల పెంపకం, లీలారావు హాస్పిటల్ ఏరియాలో ఏండ్ల తరబడి ఇబ్బంది ఉన్న డ్రైనేజీ నిర్మాణం, రేడియో సత్తయ్య వీధిలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యాయి. మట్టి రోడ్డుతో ప్రతినిత్యం దుమ్ము ధూళితో ప్రజలు నరకం అనుభవించే సూపర్ బజార్ రోడ్డు నిర్మాణానికి కృషి చేసారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న వ్యాపారులు, పాదచారులు, చిరు వ్యాపారుల కలను కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి సాకారం చేశారు. వ్యాపార కూడలిగా నిత్యం కళకళలాడే ప్రాంతంలో ఉన్న పాపారావు బొందలో గతంలో మల, మూత్ర విసర్జన లాంటి వాటిని సమూలంగా నిర్ములించారు. పండ్ల వ్యాపారులకు సౌకర్యం కల్పించి సేవలు అందించిన పేరు తెచ్చుకున్నారు. పాపారావు బొంద, ఓల్డ్ వెంకటేశ్వర టాకీస్, వడ్ల కేదారి వీధితో పాటు జేకే వీధిలో డ్రైనేజీ నిర్మాణంతో పాటు గతంలో పందుల దొడ్లను తలంపింప చేసే విధంగా ఉన్న రోడ్డును సీసి రోడ్డుగా మార్చి సమస్య లేకుండా చేసారు. 2014 నుండి 2018 వరకు నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. సొంత నిధులతో బోరు మోటర్ ఏర్పాటు చేసి తాగునీటి ఎద్దడి తీర్చారు. ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేసి సమస్య లేకుండా చేసారు. వేసవిలో వాటర్ ట్యాంకర్ల ద్వారా రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి నీటి సరఫరా చేసి అందరి ప్రశంసలు లావణ్య అందుకున్నారు. సూపర్ బజార్ రోడ్డు లో రెండు వైపులా డ్రైనేజీ నిర్మాణం, ఛాంబర్ల ఏర్పాటు చేసారు. వార్డు ప్రజలకు ఎన్నోసేవలు అందించిన ఘనత దక్కించుకున్నారు. ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహించి వారం రోజుల పాటు అల్పాహారం, ఇతర ఏర్పాట్లను సొంత నిధులతో నిర్వహించారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వివేకానంద చౌక్ లో దుర్గంధంగా ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చేశారు. దీంతోపాటు రేషన్ కార్డులు, పింఛన్లు, కేసీఆర్ కిట్లు, ఇతర సంక్షేమ పథకాలు అర్హులకు రావడానికి విశేష కృషి చేసారు.

26వ వార్డుకు అవార్డుల పంట
హరితహారంలో లావణ్య చేసిన కృషికి 2017లో వార్డుకు ఎంపికై రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డు వచ్చింది. బహిరంగ మలవిసర్జన లేని వార్డుగా 2023లో కూడా అవార్డులు వచ్చాయి. వార్డు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడం, ఉచిత కంటి పరీక్షలు, ఎలాంటి అవినీతి లేకుండా పని చేయడం, అభివృద్ధి పనుల్లో నాణ్యత, పేద ప్రజలకు చేదోడు వాదోడుగా అండగా నిలవడం, వార్డు ప్రజలకు అవసరమైన రెవిన్యూ, పోలీస్, మున్సిపల్ సంబంధ పనులు ముందుండి చేయించడం, సమస్యలు పరిష్కరించడం తదితర చర్యలతో ప్రజల్లో ఇమేజ్ ను పెంచుకున్నారు. రిజర్వేషన్ మారితే తప్ప లావణ్య నరసింహారెడ్డిని ఢీ కొనే పరిస్థితి ఇక లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే…ఏ విధంగా పనిచేసారో అర్థం చేసుకోవచ్చు. వార్డులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి హృదయాల్లో సుస్థిర స్థానం లావణ్య తన పనుల ద్వారా సంపాదించుకున్నారు.



ప్రజలే దేవుళ్ళు : లావణ్య నర్సింహారెడ్డి
ప్రజలే తమకు దేవుళ్ళని, వారి ఆశీర్వాదమే తమకు శ్రీ రామ రక్ష అని, వారు అందించిన సహాయ సహకారాలు, చూపించిన ప్రేమ ఎప్పటికి మరువలేనిదని వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని హుజురాబాద్ 26వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కేశిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి అన్నారు. మూడు పర్యాయాల్లో చేసిన అభివృద్ధి పనులు, రాజకీయాలకు అతీతంగా పనిచేయడం, వార్డులో 💯 శాతం పనులు పూర్తి చేయడం తమకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయన్నారు. ముఖ్యంగా వార్డులో వ్యాపారులు, మహిళలు, యువత తమకు అండగా నిలిచి, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చి ముందుకు నడిపించారని, ప్రోత్సహించారని తెలిపారు. వార్డు అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పూర్తిగా సహకరించారని గుర్తు చేసారు. ప్రస్తుతం నాలుగో సారి కూడా తనను గెలిపించి మరింత ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, తద్వారా వార్డును అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తామని లావణ్య నర్సింహారెడ్డి కోరారు.
మూడు సార్లు గెలిచిన రూపాయి అవినీతి లేకుండా మెదులుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ లో ఎలాంటి అవినీతి లేకుండా పనిచేసినట్లు లావణ్య నర్సింహారెడ్డి ప్రమాణం పూర్తిగా తెలిపారు. గుడి, బడి, ప్రజల ఆస్తీ అయిన దేవాలయం లాంటి మున్సిపల్ లో తాము మూడు సార్లు గెలిచిన సొంత డబ్బులు ఖర్చు చేశామో కానీ ఏ రోజు అవినీతి అక్రమాలకు పాల్పడలేదని వెల్లడించారు.






ఏది ఏమైనప్పటికీ 26వ వార్డు లావణ్య నరసింహారెడ్డికి కంచుకోట అంటూ స్థానికులు చర్చించుకోవడం ప్రత్యర్థులు పోటీ చేయాలంటే బెంబేలెత్తుతున్నారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోనే ఇన్నిసార్లు గెలిచి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన కౌన్సిలర్ లేరంటే అతిశయోక్తి కాదు.. అందుకే వారికి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి…



26వ వార్డులో ప్రజలే దేవుళ్ళుగా భావించి వారి సమస్యలపై తక్షణమే స్పందిస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్న లావణ్య నరసింహారెడ్డి దంపతులు అవార్డులు, రివార్డులు రావడంతో సత్కరిస్తున్న వార్డు ప్రజలు తదితర దృశ్యాలు..





