
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టో లో పెట్టిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపోలో కార్మికులు ఎర్ర రిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. ఆర్టీసీలో గతంలో ఉన్న యూనియన్లను పునరుద్ధరణ చేయాలని, రిటైర్డ్ కార్మికులందరికీ రావాల్సిన బకాయిలను తక్షణమే ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి రెండు సంవత్సరాలకు పైగా అవుతున్నప్పటికీ ప్రభుత్వం ఆ మాట మరిచి పోయిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు ఇవ్వకపోవడం వలన ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదన అనుభవిస్తున్నారని అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు పోరాట దినం పాటించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఠాకూర్ శివదయాల్ సింగ్, సాదుల కిషోర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మార్త రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పుల ప్రభాకర్, వివిఆర్ రెడ్డి, మోటపోతుల అశోక్, ఏవి రాజం , రాజు, రేనా, సుమలత, లక్ష్మి, మమత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ డిపో గేటు ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో కార్మికుల నిరసన..





