
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మంగళవారం సమ్మక్క జాతర ఏర్పాట్లను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ బాబు సందర్శించి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తన దృష్టికి తీసుకొని రావాలని కోరారు. జాతరకు వచ్చే భక్తులకు కావలసిన ఏర్పాట్లను చేయడంలో ఎలాంటి అశ్రద్ధ చేయరాదన్నారు. అనంతరం గద్దెల వద్ద సమ్మక్క సారలమ్మకు బంగారం చెల్లించి మొక్కులు అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్, దేవాదాయ శాఖ ఉద్యోగులు అశోక్, లోకేష్, సమ్మక్క జాతర కమిటీ పాలకవర్గం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి మోక్కులు చెల్లించుకుంటున్న ప్రణవ్ బాబు..


జాతర పోస్టుల ఆవిష్కరిస్తున్న ప్రణవ్ బాబు, సీఐ కరుణాకర్, దేవాదాయ శాఖ ఉద్యోగులు, కమిటీ సభ్యులు..


రంగనాయకుల గుట్ట వద్ద జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రణవ్ బాబు, సిఐ కరుణాకర్, కమిటీ నాయకులు, సభ్యులు..





