
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిజెపి జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హుజురాబాద్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. పట్టణంలోని బస్ డిపో క్రాస్ నుండి పట్టణంలోని వీధుల గుండా బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…. ప్రపంచంలో అతి చిన్న వయస్సులో ఒక పెద్ద జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని అన్నారు. ఆయన నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించడం గర్వకారణం అని అన్నారు. ఇంచార్జ్ ఎర్రం మహేష్, బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, గంగిశెట్టి రాజు, నల్ల సుమన్, యాంసాని శశి, కొలిపాక శ్రీనివాస్, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, యాళ్ల సంజీవరెడ్డి, సబ్బని రమేష్, అంకటి వాసు, కొలిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి..

పట్టణ వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న బిజెపి శ్రేణులు..






