
,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు బుధవారం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులైన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లోకి వస్తున్నారని అన్నారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో కోయల్కార్ భారతి, బాలాజీ, ఎబివిపి నాయకుడు నాగా సుమన్, దుర్గాజి, అనిల్ కుమార్, సబ్బని విజయ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కొలిపాక శంకర్, మేకల తిరుపతి, సొల్లు దశరథం, ఎండి ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి నాయకులకు కండువా కప్పి ఆహ్వానిస్తున్న పార్టీ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు..





