
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి హైదరాబాద్ కు బదిలీ వెళుతున్న కేoసారపు సమ్మయ్యను గురువారం మున్సిపల్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మున్సిపల్ కమిషనర్ గా సమ్మయ్య పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు తాను పనిచేస్తూ అందరితో పని చేయించారని, అందరం కలిసి సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేవారని అన్నారు. తన విధితో పాటు సమాజ ప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తి బదిలీపై వెళ్లడం బాధాకరమైన విషయం అని అన్నారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ… తమ ఆసుపత్రికి మున్సిపాలిటీ నుండి ఎన్ని పనులు జరగాలో అన్ని రకాల పనులు అడగగానే చేసిన మంచి వ్యక్తి కమిషనర్ సమ్మయ్య అని అభినందించారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయులు కమిషనర్ సమ్మయ్యను ఘనంగా సన్మానించారు. పాఠశాల పిల్లల విద్యాభివృద్ధి కోసం సౌకర్యాలు నిమిత్తం తాము అడగగానే తమ పాఠశాలకు అన్ని రకాల సౌకర్యాలను కమిషనర్ సమ్మయ్య చేకూర్చారని అన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు రోంటాల బుచ్చయ్య, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, డిటిఎఫ్ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, రవిశంకర్ శుక్ల, ఆసియా, మారుతీ ప్రసాద్, సదానందం, మేనేజర్ భూపాల్ రెడ్డి, టిపిఎస్ అశ్విని గాంధీ, సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, ఎన్విరాన్మెంట్ అధికారి సాయి, రాజయ్య, మెప్మా అధికారులు, సిబ్బంది, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ను సన్మానిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది..

కమిషనర్ ను శాలువాతో ఘనంగా సన్మానిస్తున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు రోంటాల బుచ్చయ్య





