Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట వద్దగల పాటిమీద శ్రీ ఆంజనేయస్వామి సరస్వతి సహిత దేవాలయంలో ఈనెల 23వ తేదీ శుక్రవారం వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ చైర్మన్ గందే శ్రీనివాస్, అర్చకులు తిరునగరి తిరుమలేష్ లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మాఘ శుక్ల పంచమి రోజున సరస్వతి మాత జన్మదిన o సందర్భంగా వసంత పంచమి వేడుకలను ఆలయంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో సహస్రనామార్చన, హారతి కార్యక్రమాలతో పాటు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.


రంగనాయకులగుట్ట వద్దగల పాటిమీద శ్రీ ఆంజనేయస్వామి సరస్వతి సహిత దేవాలయం





