
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో హుజురాబాద్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్ నాయకత్వం వహించగా, ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను గుర్తించి వెంటనే ప్రత్యేక జిల్లా హోదా కల్పించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీనియర్ న్యాయవాదులు నల్ల భూమిరెడ్డి, ముక్కెర రాజమౌళి, గోస్కుల శ్రీనివాస్, జి. లక్ష్మణమూర్తి, బత్తుల తిరుపతి, విక్రమ్, కొత్తూరి రమేష్, ప్రభు, కొండయ్య, ఏ లింగమూర్తి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అలాగే శిరీష, మౌనిక, దివ్య, అంజలి, ఆకుల శ్రీనివాస్, జాఫర్, శ్రవణ్, మురళి, రవి తేజ, అశోక్, అనిల్, నాగరాజు, హరిహరన్, పిట్టల రాజేష్, భానుకిరణ్, మాటెలా తిరుపతి, కుమార్, మోరే కళ్యాణ్ తో పాటు జూనియర్, సీనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ, హుజురాబాద్‌కు చారిత్రక ప్రాధాన్యతతో పాటు పరిపాలనా సౌలభ్యం, న్యాయవ్యవస్థ అభివృద్ధి కోసం ప్రత్యేక జిల్లా అత్యవసరమని తెలిపారు. జిల్లా హోదా లభిస్తే ప్రజలకు న్యాయ సేవలు వేగవంతం అవుతాయని, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని హెచ్చరిస్తూ, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు.


ర్యాలీగా తరలివచ్చి చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తున్న న్యాయవాదులు..





