
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అన్ని దానాల కన్నా అవయవ దానం గొప్పదని, ఆ దానంతో మరికొంతమందికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని అలాంటివారు ధన్యులు అని హుజురాబాద్ ఏసీపి వాసంశెట్టి మాధవి అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని మామిళ్లవాడలో నేత్రదానం చేసిన స్వర్గీయ ముషం జయలక్ష్మి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ జన్మ ఎత్తడం సాధారణమని కానీ ఆ జన్మకు సార్ధకత ఉన్నప్పుడే గొప్పతనం వస్తుందన్నారు. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో పనులు చేస్తారని కానీ తను మరణించిన తన పేరు గుర్తుండే విధంగా చేసే దానాలలో అవయవ దానాలు గొప్పవని అన్నారు. నేత్రదానం చేసిన జయలక్ష్మి కుటుంబ సభ్యులను ఆమె అభినందించారు. ఆమె చేసిన నేత్రదానం వల్ల ఇద్దరు అంధూలకు చూపు లభిస్తుంది చెప్పారు. ఆమె నేత్రదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యుల ఔదార్యం గొప్పదని ప్రశంసించారు. అవయవ దానం కోసం కృషి చేస్తున్న సదాశాయ పౌండేషన్ కృషిని మెచ్చుకున్నారు. జగన్ కుటుంబ సభ్యులు సైతం పలువురు అవయవ దానం చేయడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తన కుటుంబం సైతం అవయవ దానానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జయలక్ష్మి భర్త జగన్, కుమారుడు కృష్ణ, ఇతర కుటుంబ సభ్యులను సన్మానించారు. కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ అభినందనపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు నరహరి, జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి, కుటుంబ సభ్యులు, భర్త జగన్, కుమారుడు కృష్ణ, కుమార్తెలు స్వప్న, సంధ్య, కోడలు అనిత, ముషం వెంకటేశ్వర్లు, పద్మశాలి సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

జయలక్ష్మి కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ అభినందన పత్రం అందజేస్తున్న ఏసీబీ మాధవి ఫౌండేషన్ నిర్వాహకులు..


జయలక్ష్మి భర్త జగన్ ను ఓదార్చుతున్న ఏసిపి మాధవి





