
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఆదివారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా పోటీలు సభ్యులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులకు పరుగు పందెం, షార్ట్ పుట్, టగ్ ఆఫ్ వార్ తదితర ఆటలను నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమురవెల్లి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎండి మతిన్ లు మాట్లాడుతూ… వయసుతో సంబంధం లేకుండా క్రీడలను నిర్వహించాలని వారిలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి దోహదపడతాయన్నారు. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా వాకర్స్ కు క్రీడలను నిర్వహించి వారిలో క్రీడల పట్ల ఆసక్తి పెంచుతామని అన్నారు. ఈ క్రీడలను రిటైర్డ్ పిడి లు కొన్ని రాజిరెడ్డి, సొల్లు సారయ్య లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, పాక సతీష్, ఆకుల సదానందం, కిరణ్ కుమార్, కాయిత రాములు, సృజన్ , బుసారపు శంకర్ , సుధాకర్, సారయ్య, సదానందం వెంకటరాజo, ప్రభాకర్, మాధవరావు, నరసింహాచారి, రమేష్, సాదుల రవీందర్, ప్రకాష్, జన్నయ్య , తదితరులు పాల్గొన్నారు.


షాట్ పుట్ విసురుతున్న వాకర్స్..




బహుమతులు అందజేస్తున్న అధ్యక్షుడు హరిప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ లు





