
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ నెల 27 నుండి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరగనున్న జాతీయ స్థాయి హాకీ పోటీలకు హుజురాబాద్ కు చెందిన నలుగురు హాకీ క్రీడాకారులు ఎంపికయ్యారు. జనవరి 9, 10, 11వ తేదీలలో వనపర్తి జిల్లాలో జరిగిన 69 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న నిమ్మటూరి లవణీ ప్రియ, ఈ. రిషిక , సాదుల అభినయ్, కే. చరణ్ లు అత్యంత ప్రతిభ కనబరచడం, జట్టు విజయానికి వీరి నైపుణ్యం తోడు కావడంతో వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. హుజురాబాద్ కు చెందిన నలుగురు క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్, హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, క్లబ్ మాజీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి తిరుపతి , గంగిశెట్టి ఉమామహేశ్వర్, భూసారపు శంకర్, వేముల రవికుమార్, ఎండి. సజ్జు, సాదుల శ్యాం కుమార్, టి. శ్రీనివాస్, మాటూరి రాజేష్, ఎన్ సాయికృష్ణ, కాయంకంటి రాజేష్, గుడ్డేలుగుల ప్రదీప్, సబ్బని విక్రం, మోటపోతుల విక్రమ్, వినయ్, వంశీ, విపుల్, బన్నీ, రాజ్ కుమార్, మితిన్, మధు తదితరులు అభినందించారు.

జాతీయ హాకీ పోటీలకు ఎంపికైన నలుగురు క్రీడాకారులు





